Vahana Mitra వాహనమిత్ర @ 5,157
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:11 AM
Vahana Mitra @ 5,157 రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా కానుకగా రూ.15 వేల చొప్పున వారి ఖాతాకు జమ చేయనున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
పార్వతీపురం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా కానుకగా రూ.15 వేల చొప్పున వారి ఖాతాకు జమ చేయనున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబరు 2న ఈ నగదు జమయ్యే అవకాశం ఉండగా.. వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇప్పటివరకు 5,356 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా వచ్చాయి. అందులో 5,157 దరఖాస్తులను అధికారులు ఆమోదిం చారు. మరో 161 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తుది జాబితా ప్రకటిస్తామని జిల్లా రవాణా శాఖాధికారి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలో 4,614 మందిని మాత్రమే వాహన మిత్ర లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. అనేక మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్న ప్పటికీ నిబంధనల పేరిట వాటిని తిరస్కరించింది.