రాయితీ విత్తనాలను వినియోగించుకోండి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:28 AM
ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న విత్తనా లను రైతులు వినియో గించుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న విత్తనా లను రైతులు వినియో గించుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మల క్ష్మీపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆమె రాయితీపై కందులు, రాగులు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అడ్డాకుల నరేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ కోలా రంజిత్‌కుమార్, కొమరాడ మండల రైతు అధ్యక్షుడు బత్తిలి శ్రీను, కురుపాం ఏడీఏ రెడ్డి అన్నపూర్ణ, గుమ్మల క్ష్మీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల ఏవోలు పాల్గొన్నారు.
ఫ సీతంపేట రూరల్, జూలై 3(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. కుసిమి గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు శతశాతం రాయితీతో కందులు, రాగులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. ఒక్కో రైతుకు ఎకరాకు 500గ్రాముల కందులు, 2 కేజీల రాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సంధ్యారాణి, ఎంపీడీవో బీబీ మిశ్రో, వ్యవసాయ శాఖ ఏడీ రత్నకుమారి, ఏవో వై.వాహిని, కూటమి నాయకులు ఎన్.నాగేశ్వరరావు, హెచ్ ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.