Share News

అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:56 PM

జిల్లాలో యూరియా విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి గొడవలు చోటుచేసుకుండా ఉండేందుకు అధికారుల సమక్షంలో పంపిణీకేపట్టారు.

అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ
సంతకవిటి: సిరిపురంలో యూరియా కోసం ఎగబడిన రైతులు:

జిల్లాలో యూరియా విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి గొడవలు చోటుచేసుకుండా ఉండేందుకు అధికారుల సమక్షంలో పంపిణీకేపట్టారు.

ఫ దత్తిరాజేరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని తహసీల్దార్‌ పి.విజయభాస్కర్‌ కోరారు. మంగళవారం వంగర, గొభ్యాం, షికారుగంజి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణమూర్తినాయుడు, మాజీ సర్పంచ్‌లు సత్యారావు, దేవుడు, వ్యవసాయ సహాయ సిబ్బంది పాల్గొన్నారు.

ఫభోగాపురం, సెప్టెంబరు23(ఆంధ్రజ్యోతి):భోగాపురంలో మాతావెంకటేశ్వర ఎరువు ల దుకాణాన్ని తహసీల్ధార్‌ ఎం.రమణమ్మ మంగళవారం తనిఖీ చేశారు. యూరియా నిల్వల రికార్డులను పరిశీలించారు. వీఆర్వో వీవీఎస్‌ఎన్‌ రాజు పాల్గొన్నారు.

ఫజామి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అందరికి యూరియా అందిస్తున్నామని, ఎటువంటి కొరత లేదని ఏవో పూర్ణిమ తెలిపారు. మంగళవారం ఆగ్రహారం రైతులకు యూరియా పంపిణీచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణంరాజు పాల్గొన్నారు.

ఫ రేగిడి, సెప్టెంబరు 23,(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోడిశ, కొమిర, చిన్నశిర్లాం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఎరువుల పంపిణీని తహసీల్దార్‌ కృష్ణలత పరిశీలించారు. కోడిశలో పోలీస్‌ల పర్యవేక్షణలో పంపిణీ చేశారు.

ఫ సంతకవిటి, సెప్టెంబరు23(ఆంధ్రజ్యోతి):మండలంలోని సిరిపురంలో యూరియా పంపిణీ నిలిపివేశారు. ఇక్కడ సచివాలయానికి పది మెట్రిక్‌ టన్నులు (224 బస్తాలు) యూరియావచ్చింది. గ్రామంలో 500 మందికి పైగా రైతులు సచివాలయానికి రావడం తో పంపిణీచేయడానికి అధికారులు ఇబ్బందులుపడ్డారు.ఇంకో లోడ్‌ యూరియా వచ్చిన తరువాత అందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అఽధికారులను గ్రామస్థులు కోరడంతో పంపిణీని నిలిపివేశారు.

ఫడెంకాడ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): డెంకాడ రైతు భరోసా కేంద్రం, సాయికృష్ణ రైతు మిత్ర గ్రూపు ఎరువుల షాపు వద్ద ఏవో సంగీత, తహసీల్దార్‌ రాజారావు, ఎస్‌ఐ సన్యాసినాయుడుల ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు.సోమవారం మండలానికి 48 మెట్రిక్‌ టన్నుల యూరియావచ్చిందని, మంగళవారం పెదతాడివాడ, పినతాడివాడ, సింగవరం, నాతవలస, నగరంపేట, మహంతిపేట, గుండాలపేట, రఘు మండ రైతులకు పంపిణీ చేసినట్లు ఏవో తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో రామకోటి, వీఏఏలు లెనిన్‌, రాంబాబు, అపర్ణ పాల్గొన్నారు.

యూరియా కోసం బైఠాయించిన రైతులు

గుర్ల, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): గుర్లలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెల కొంది. యూరియా కోసం వివిధ ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చారు. దీంతో ఎరువుల దుకాణదారులు మూసేయడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఎస్‌ఐ నారాయణరావు వ్యవసాయాధికారులతో మాట్లాడి బుధవారం ఎరువులు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.

Updated Date - Sep 23 , 2025 | 11:56 PM