Backward Classesl బీసీల అభ్యున్నతే లక్ష్యం
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:28 PM
Upliftment of Backward Classes is the Goal బీసీ అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని , వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా విచ్చేసిన మంత్రి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

పార్వతీపురం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): బీసీ అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని , వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా విచ్చేసిన మంత్రి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇదే నెలలో బాబూ జగ్జీవన్‌రామ్ , జ్యోతిబా పూలే, అంబేడ్కర్ వంటి మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. బీసీల రక్షణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయడమే కాకుండా నామినేటెడ్ పోస్టులు, చట్ట సభల్లో 34 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కతుంది. వివిధ కులవృత్తుల వారి కోసం ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాం. బీసీ లబ్ధిదారుల గృహ నిర్మాణాల వేగవంతానికి ప్రభుత్వం అదనంగా రూ.50 వేలను అందిస్తోంది. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రూ.900 కోట్ల మేర రుణాలు మంజూరు చేసింది. 50 శాతం సబ్సిడీతో సూర్యఘర్ యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామాల అభివృద్ధిలో భాగంగా సర్పంచ్‌లకు నిధులు కేటాయిం చింది. వెనుకబడిన కుటుంబాల ఆర్థికాభివృద్ధికే ప్రభుత్వం పీ-4 సర్వేకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 2,929 మంది బీసీ లబ్ధిదారులకు రూ.35 కోట్లు మేర రుణాలను అందిస్తున్నాం. ’ అని తెలిపారు. అనంతరం 124 మంది లబ్ధిదారులకు రూ.2.71కోట్ల మెగా చెక్కును, వ్యవసాయ, ఇతర పనిముట్లు పంపిణీ చేశారు. పీఎంఈజీపీ కింద బొలేరో వాహనం, డీజే సౌండ్‌సిస్టం, ఆవును, కుట్టుమిషన్‌ను అందించారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 49 శాతం మేర నిరక్షరాస్యత ఉందని తెలిపారు. అయితే ఆరోజుల్లోనే నిరక్షరాస్యత ఉండరాదని యోచించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని తెలిపారు. 14 బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయన్నారు. బీసీ విద్యార్థులకు డీఎస్సీ కోచింగ్, ఉపకార వేతనాలు, జీవనోపాధుల నిమిత్తం రూ.247 కోట్లు మంజూరు చేయనున్నట్టు వివరించారు. రూ.10 కోట్ల విలువైన ఆధునిక వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో జేసీ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, బీసీ సంక్షేమాధికారి ఇ.అప్పన్న, డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.