Share News

Unique in Water Conservation జల సంరక్షణలో అ‘ద్వితీయ’ం

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:39 PM

Unique in Water Conservation జల సంరక్షణలో జిల్లా మెరిసింది. జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. భూగర్భ జలాలు పెరిగే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ఫాంపాండ్స్‌ తవ్వకాలు మన్యానికి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

 Unique in Water Conservation  జల సంరక్షణలో అ‘ద్వితీయ’ం
ఫాంపాండ్స్‌ తవ్వకాల్లో ఉపాధి వేతనదారులు (ఫైల్‌)

  • రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

పార్వతీపురం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణలో జిల్లా మెరిసింది. జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. భూగర్భ జలాలు పెరిగే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ఫాంపాండ్స్‌ తవ్వకాలు మన్యానికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. జిల్లాలో 2024-25లో 11367 ఫాంపాండ్స్‌ తవ్వకాలకు చేపట్టారు. 8793 ఇంకుడు గుంతలు తవ్వించారు. 1139 చెరువులను అభివృద్ధి చేశారు. అమృత్‌ సరోవర్‌ కింద మరో 257 చెరువులను సుందరీకరించారు. కాగా జిల్లా యంత్రాంగం చేపట్టిన పనులతో మన్యంలో గత ఏడాది 22 అడుగుల దిగువకు ఉన్న భూగర్భ జలాలు 17 అడుగులకు చేరుకున్నాయి. జల సంరక్షణలో జిల్లా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ద్వితీయ, ప్రథమ స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబునాయుడు అధికార యంత్రాంగాన్ని అభినందించారన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు పనులు చేపడతామని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన జల సంరక్షణ పనులతో జిల్లాలో భూగర్భజలాలు పెరిగాయని, దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉందని డ్వామా పీడీ కె.రామచం ద్రరావు తెలిపారు.

Updated Date - Sep 01 , 2025 | 11:39 PM