Share News

Uninterrupted Urea Supply నిరంతరంగా యూరియా సరఫరా

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:10 AM

Uninterrupted Urea Supply జిల్లాలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరంగా యూరియా సరఫరా చేయనున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలతో తెలిపారు. ప్రస్తుతం 633 మెట్రిక్‌ టన్నులు యూరియా నిల్వలు రైతు సేవా కేంద్రాల వద్ద ఉన్నాయన్నారు. రాబోయే పది రోజుల్లో మరో 2,500 మెట్రిక్‌ టన్నులు రానుందన్నారు.

Uninterrupted Urea Supply నిరంతరంగా యూరియా సరఫరా
మాట్లాడుతున్న‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరంగా యూరియా సరఫరా చేయనున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలతో తెలిపారు. ప్రస్తుతం 633 మెట్రిక్‌ టన్నులు యూరియా నిల్వలు రైతు సేవా కేంద్రాల వద్ద ఉన్నాయన్నారు. రాబోయే పది రోజుల్లో మరో 2,500 మెట్రిక్‌ టన్నులు రానుందన్నారు. రైతుల వేలిముద్రలు వేసి, ఆధార్‌ అధీకృత విధానం ద్వారా యూరియా కొనుగోలు చేయాలన్నారు. అధిక ధరలకు యూరియా అమ్మితే సమీపంలో ఉన్న మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమస్యలేమైనా ఉంటే ఈ 94401 04317, 79894 34766 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలన్నారు. పార్వతీపురం డివిజన్‌లో వారు 83310 56268, కురుపాం 83310 56266, పాలకొండ 83310 56206, సాలూరులో రైతులు ఈ 83310 56265 నెంబర్లను సం ప్రదించాలని సూచించారు.

Updated Date - Sep 05 , 2025 | 12:10 AM