రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:48 PM
మండలంలోని అలమండ-కంటకపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ మృతి చెందింది.
జామి, జూలై 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని అలమండ-కంటకపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. ఈ విషయంపై రైల్వే పోలీసులు ఆదివారం మాట్లాడుతూ మృతురాలు 40 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి, ఐదు అడుగుల పొడుగు ఉంటుందన్నారు. ఎరుపురంగు చాయతో ఉండి, ఆకుపచ్చ, ఆరంజ్ రంగులతో కూడిన నైటీ ధరించి ఉందని చెప్పారు. తెలిసినవారు 9490617089, 9182073593 నెంబర్లను సంప్రదించాలని కోరారు.