Share News

రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:06 AM

బొండపల్లి, గరుగుబిల్లి రైల్వేస్టేషన్‌ మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడు మృతిచెందినట్టు బొబ్బిలి రైల్వే పోలీసు స్టేషన్‌ హెచ్‌సీ బి.ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు.

రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

బొండపల్లి, సెప్టెంబర్‌ 5(ఆంధ్రజ్యోతి): బొండపల్లి, గరుగుబిల్లి రైల్వేస్టేషన్‌ మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడు మృతిచెందినట్టు బొబ్బిలి రైల్వే పోలీసు స్టేషన్‌ హెచ్‌సీ బి.ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల వయస్సుకలిగి.. పసుపు రంగు టీషర్టు, నలుపు రంగు ఫ్యాంటు కలిగిఉన్న యువకుడి మృతదేహాన్ని పోలీసులు పట్టాలపై గుర్తించామని చెప్పారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు. పూర్తి సమాచారం కోసం విజయ నగరం రైల్వే ఎస్‌ఐ బాలాజీరావును 9490617089, 9491813163 నెంబర్లకు సంప్రదించాంచాలని కోరారు.

Updated Date - Sep 06 , 2025 | 12:06 AM