రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:28 AM
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ బి.ఈశ్వరరావు తెలిపారు.
బాడంగి, అక్టోబరు21 (ఆంధ్రజ్యోతి): రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ బి.ఈశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సొమవారం పిండ్రంగివలస ఎల్‌సీ గేటు సమీపంలో దాదాపు 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించామన్నారు. రైలు ఢీకొని గానీ, రైలు నుంచి జారిపడి గానీ మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నామ న్నారు. మృతుడు తెల్ల టీషర్టు ధరించి ఉన్నాడని, దానిపై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫొటో, ఏక్తా దివస్ కొండాపడ బీజేపీ అని ఒరియా భాషలో రాసి ఉంద న్నారు కాషాయం రంగు టవల్, పసుపు రంగు దుప్పటి, గులాబీ రంగు లుంగీ ధరించి ఉన్నాడన్నారు. చేతి సంచిలో చిల్లర పైసలు, బియ్యం ఉన్నాయన్నారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9490617089, 8309901038లను సంప్రదించాలని సూచించారు.