రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:34 AM
మండలంలోని కొత్తవలస-కంటకాపల్లి రైల్వేస్టేషన్ల మధ్యనున్న రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించినట్టు విజయనగరం జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు.
కొత్తవలస, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తవలస-కంటకాపల్లి రైల్వేస్టేషన్ల మధ్యనున్న రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించినట్టు విజయనగరం జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాల లోపు ఉంటుందన్నారు. ఎరుపు రంగు ఫుల్‌హ్యాండ్ టీ షర్టు, గ్రే కలర్ లోయల్, బ్లూకలర్ ఫ్యాంటు దరించి ఉన్నట్టు చెప్పారు. మృతుడు రైలులో నుంచి జారి పడిపోయాడా.. రైలు కిందపడి మృతిచెందాడా.. అనే విషయాలు తెలియరాలేదన్నారు. పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. వివరాల కోసం విజయనగరం జీఆర్పీ స్టేషన్‌లో సంప్రదించవచ్చునని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.