Share News

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:15 AM

గుర్తుతెలియని రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుం ది.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

దత్తిరాజేరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోమటిపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గల అప్‌లైన్‌లో గుర్తు తెలియన రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. లైట్‌ బ్లూ కలర్‌ నిక్కరు, తెలుపు, నలుపు, బ్లూ కలర్‌ అడ్డుగడుల టీషర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9491813163, 8309901038, 9490617089 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

Updated Date - Jul 23 , 2025 | 12:15 AM