అనుమతులు లేని వాటర్‌ప్లాంట్ల మూత
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:39 AM
ఎస్.కోట ఒన్‌వే ట్రాఫిక్ సమీపంలో గల ఐశ్వర్య డ్రింకింగ్, పుణ్యగిరి రోడ్డులోని శ్రీదారగంగమ్మతల్లి రోహి వాటర్ ప్లాంట్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు లేకపోవడంతో జిల్లా పుడ్ సేఫ్టీ అధికారి నాగూల్ మీరా మూసివేయించారు. గురువారం ఎస్.కోటలోని వాటర్‌ప్లాంట్లను తనిఖీచేశారు.
శృంగవరపుకోట, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):ఎస్.కోట ఒన్‌వే ట్రాఫిక్ సమీపంలో గల ఐశ్వర్య డ్రింకింగ్, పుణ్యగిరి రోడ్డులోని శ్రీదారగంగమ్మతల్లి రోహి వాటర్ ప్లాంట్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు లేకపోవడంతో జిల్లా పుడ్ సేఫ్టీ అధికారి నాగూల్ మీరా మూసివేయించారు. గురువారం ఎస్.కోటలోని వాటర్‌ప్లాంట్లను తనిఖీచేశారు. ప్లాంట్లకు వున్న అనుమతులు చూపించాలని యజమానులను కోరారు. ఏడాది కిందట నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి పొందాలని చెబుతున్నా పట్టించుకోలేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనుమతి పొందేవరకు ప్లాంట్లను తెరవద్దని ఆదేశించారు. అనంతరం పుణ్యగిరి రోడ్డులోని సబ్ జైలు ఖైదీలకు వండే వంట సరుకులను పరిశీలించారు. నాసిరకం కందిపప్పు వాడోద్దని, మెదటి రకం కంది పప్పును వాడాలని సూచించారు. స్థానికుల పిర్యాదు మేరకు విశాఖ-అరకు రోడ్డులో గల మిస్సెస్ లక్ష్మీ నారాయణ ట్రెడర్స్‌ను తనిఖీ చేశారు. అక్కడ డబ్బాల్లో వున్న ఆయిల్ శాంపిల్‌ను సేకరించి, హైదరాబాద్‌లోని నాచారం పంపి స్తామని చెప్పారు. అక్కడ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఈ ట్రేడర్స్ యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గజపతినగరం, అక్టోబరు9(ఆంధ్రజ్యోతి): నిబంధనలను అతిక్రమిస్తే అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్.ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని ఎం. వెంకటాపురంలో డీలర్ షాపును తనిఖీ చేశారు. డీలరుప్రతాప్‌ను రేషన్ డిపోకు సంబందించిన బియ్యంపై అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎం. వెంకటాపురం అంగన్‌వాడీ -1 కేంద్రాన్ని పరిశీలించారు కార్య క్రమంలో డీఎస్‌వో మురళీనాథ్, డీఎం కార్యాలయం ఏఈ ఎం. వెంకటరావు, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి ఈశ్వరరావు తిరుపతిరావు పాల్గొన్నారు.