Share News

Heat.. ఎండ తీవ్రతను తట్టుకోలేక..

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:31 AM

Unable to Withstand the Intense Heat.. ఎండలు ఠారెత్తిస్తున్నాయ్‌.. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. మార్చి ప్రారంభంలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.

  Heat.. ఎండ తీవ్రతను తట్టుకోలేక..
దిమ్మిడిజోల తోటల్లో నీడ పట్టున ఉన్న మూగజీవాలు

భామిని,మార్చి12(ఆంధ్రజ్యోతి): ఎండలు ఠారెత్తిస్తున్నాయ్‌.. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. మార్చి ప్రారంభంలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మేనెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు. కాగా భామిని మండలం దిమ్మిడిజోలలో మూగజీవాలు ఉదయం 11 గంటల సమయంలో ఇలా చెట్ల కింద నీడ పట్టున చేరాయి. ఎండ తీవ్రత దృష్ట్యా రోజూ మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత పశువులను మేతకు తీసుకెళ్తున్నట్లు పెంపకందారులు చెబుతున్నారు. ఏదేమైనా ఎండ వేడికి మూగజీవాలు విలవిల్లాడిపోతున్నాయి.

  • పాలకొండ: జిల్లాలో పార్వతీపురం, పాలకొండ, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం మండలాల్లో బుధవారం వడగాడ్పుల ప్రభావం కనిపించింది. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని 14 మండలాల్లో బుధవారం వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించగా.. వాటిల్లో 11 మండలాలు మన్యం జిల్లాలోనే ఉండడం విశేషం.

Updated Date - Mar 13 , 2025 | 12:31 AM