Nagavali నాగావళిలో తగ్గని వరద
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:12 AM
Unabating Floods in Nagavali తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టడం లేదు. బుధవారం పైప్రాంతాల నుంచి నదిలోకి 8 వేల క్యూసెక్కులు చేరింది.
గరుగుబిల్లి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టడం లేదు. బుధవారం పైప్రాంతాల నుంచి నదిలోకి 8 వేల క్యూసెక్కులు చేరింది. దీంతో అధికారులు ముందస్తుగా స్పిల్‌వే గేట్ల నుంచి 6 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేరశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 103.80 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. సాగునీటి అవసరాలకు ప్రధాన కాలువల నుంచి 1070 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ హెచ్.మన్మఽథరావు తెలిపారు.