Share News

ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరి మృతి

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:12 AM

మండలంలోని వెంపల గూడ జంక్షన్‌ సమీపంలోని పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారిపై మంగళ వారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.

ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరి మృతి

సీతంపేట రూరల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంపల గూడ జంక్షన్‌ సమీపంలోని పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారిపై మంగళ వారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘట నలో ఇప్పగూడ గ్రామానికి చెందిన పెద్దింటి సోమేశ్వరరావు(53) మృతి చెందా డు. ఎస్‌ఐ అమ్మనరావు తెలిపిన వివరాల మేరకు సీతంపేట మండలం ఇప్పగూడ గ్రామానికి చెందిన పి.సోమేశ్వరరావు ద్విచక్ర వాహనంపై సీతంపేట వైపు వస్తుండగా వెంపలగూడ జంక్షన్‌ సమీపంలో సీతంపేట నుంచి ద్విచక్ర వాహనంపై కొత్తూరు మండలం జోగుపాడు గ్రామానికి వెళుతున్న ఆర్‌.యు గంధర్‌, టి.జయరాజు, డి.అరవింద ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు ఎదురె దురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందా డు. ముగ్గురు క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యుగంధర్‌ తలకు బల మైన గాయం కావడంతో ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. మిగిలిన ఇద్దరు సీతంపేట ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ అమ్మనరావు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య రెండేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తె, కుమారుడు బీఫార్మసీ చదువుతున్నారు. నలుగురితో కలివిడిగాద ఉండే సోమేశ్వరరావు మృతితో ఇప్పగూడలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Dec 24 , 2025 | 12:12 AM