భూమి స్వాధీనంపై ఇరువర్గాల వాగ్వాదం
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:24 AM
మండలంలోని గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద గల సుమారు 30 సెంట్ల భూమి వివాదంపై ఉత్కంఠ వీడింది. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వైసీపీకి చెందిన ఓ నేత నుంచి భూమిని స్వాధీనంపరుచుకుంటున్న సందర్భంలో శనివారం వాగ్వాదం చోటు చేసుకుంది.
లక్కవరపుకోట, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద గల సుమారు 30 సెంట్ల భూమి వివాదంపై ఉత్కంఠ వీడింది. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వైసీపీకి చెందిన ఓ నేత నుంచి భూమిని స్వాధీనంపరుచుకుంటున్న సందర్భంలో శనివారం వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నా రు. పోలీసుల కథనం మేరకు..ఆర్జీపేటకు చెందిన జీవీఎస్ రాముకు 1990లో డాక్యుమెంట్ నెంబరు 542 ద్వారా గోల్డ్‌స్టార్ జంక్షన్‌లో సుమారు 30 సెంట్ల స్థలం దఖలుపడింది.ఈ భూమిపై అదేగ్రామానికి చెందిన పినిశెట్టి కిష్టమ్మ దొర కోర్టులో కేసువేశారు.టైటిల్ నిరూపించుకోకపోడంతో కోర్టు ఆ కేసును డిస్మిస్‌చేసింది. దీంతో సంబంధిత స్థలాన్ని హక్కుదారుడు రాము లెవిల్ చేస్తుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.