Share News

గంజాయి కేసులో ఇద్దరికి రెండేళ్లు జైలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:28 AM

జిల్లా కేంద్రంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో 2024లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు రెండేళ్లు జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటవ ఏడీజే న్యాయాధికారి ఎం.మీనాదేవి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

 గంజాయి కేసులో ఇద్దరికి రెండేళ్లు  జైలు

విజయనగరం క్రైం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో 2024లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు రెండేళ్లు జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటవ ఏడీజే న్యాయాధికారి ఎం.మీనాదేవి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2024 ఆగస్టు 25న శ్రీనివాస్‌నగర్‌లోని కోమటిచెరువు వద్ద నగరానికి చెందిన ఉమంది ఎల్లయ్య, బోని యూసఫ్‌లు అక్కడ ఉన్న పోలీసులను చూసి పారి పోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని, వారి వద్ద నుంచి 3.1 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాసరావు వారిని రిమాండ్‌కు తరలించి, అభియోగపత్రాలు దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో విజయనగరం ఒకటవ ఏడీజే న్యాయాధికారి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన సీఐ శ్రీనివాసరావు, సిబ్బందిని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారు.

Updated Date - Aug 12 , 2025 | 12:28 AM