Share News

గంజాయి కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:06 AM

గంజాయి కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.20వేలు జరిమానా విధిస్తూ ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ న్యాయాధికారి ఎం.మీనాదేవి గురువారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

 గంజాయి కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు

విజయనగరం క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎస్‌.కోట పోలీసు స్టేషన్‌లో 2018లో నమోదైన గంజాయి కేసులో ఏఎస్‌ఆర్‌ జిల్లా డుబ్రిగూడ మండలానికి చెందిన నిందితుడు కిముడు జయరామ్‌, అనకాపల్లి జిల్లా సబ్బవ రం మండలానికి చెందిన దత్తి ప్రవీణ్‌లకు మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.20వేలు జరిమానా విధిస్తూ ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ న్యాయాధికారి ఎం.మీనాదేవి గురువారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. ఎస్‌.కోట పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఆకుల డిపో ప్రాంతంలో 2018 డిసెంబరు 20న ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గంజాయి రవాణా చేస్తున్నట్టు వచ్చి న సమాచారంతో ఎస్‌.కోటకు చెందిన పోలీసులు అక్కడకు చేరుకుని వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనం తనిఖీ చేసి.. 3,750 కిలోల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అప్పటి ఎస్‌ఐ అమ్మినాయుడు కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ డి.వెంకటరావు ద ర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేశారు. అనంతరం సీఐగా బాధ్యతలు చేపట్టిన బి.శ్రీనివాసరావు కోర్టు లో అభియోగ పత్రాలు జారీ చేశారు. విచారణలో నిందితులు కిమిడి జయరా మ్‌, దత్తి ప్రవీణ్‌లపై నేరారోపణలు రుజవయ్యాయి. దీంతో వారిద్దరికీ కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు అఽఽధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Oct 24 , 2025 | 12:06 AM