Two More... మరో ఇద్దరు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:44 PM
Two More... సీతంపేటలో మరో ఇద్దరు గిరిజన విద్యార్థుల్లో పచ్చకామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి రెఫర్ చేశారు. ఇప్పటికే సీతంపేట గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు గిరిజన
నాలుగుకి చేరిన జాండీస్ బాధితుల సంఖ్య
సీతంపేట రూరల్, నవంబరు8(ఆంధ్రజ్యోతి): సీతంపేటలో మరో ఇద్దరు గిరిజన విద్యార్థుల్లో పచ్చకామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి రెఫర్ చేశారు. ఇప్పటికే సీతంపేట గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు (ఏడో తరగతి) పచ్చకామెర్లతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందర్నీ పాలకొండ, సీతంపేట ఏరియా ఆసుపత్రులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా 8, 9 తరగతులు చదువుతున్న బిడ్డిక లీలాసాయి, పాలక చరణ్‌లకు జాండీస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యసిబ్బంది సూచనల మేరకు పాఠశాల హెచ్‌ఎం చందర్రావు, వార్డెన్ గాసయ్యలు విద్యార్థు లను ఐటీడీఏ అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉప్పరజమ్మి, మసాన్‌పుట్టి గ్రామాల్లో ఉంటున్న వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మొత్తంగా ఈ పాఠశాలలో పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్య నాలుగుకి చేరింది.