Share News

రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:12 AM

బిల్లలవలస జంక్షన్‌ సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు.

రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

బొండపల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బిల్లలవలస జంక్షన్‌ సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘఢ్‌ నుంచి విశాఖపట్నానికి బియ్యం లోడుతో వెళుతున్న లారీ విశాఖ నుంచి జార్స్‌డా ఐరెన్‌ ఓర్‌తో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌లోని చీడీ జిల్లాకు చెందిన సందీప్‌ (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ మహేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:12 AM