బస్తాకు రెండు కిలోల తరుగు!
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:26 AM
చీపురు పల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ ద్వారా మెరకముడిదాం మండలంలోని అన్ని రేషన్ డిపోలకు పంపిణీ చేస్తున్న బియ్యంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని డీలర్ల సంఘం జిల్లా డివిజన్ ఉపాధ్యక్షుడు కెంగువ శ్రీను, మండల అధ్యక్షుడు సుంకరి జయసింహ ఆరోపించారు.
చీపురుపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ తీరుపై మెరకముడిదాం మండల రేషన్ డీలర్ల ఫిర్యాదు
మెరకముడిదాం, జూలై 26(ఆంధ్రజ్యోతి): చీపురు పల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ ద్వారా మెరకముడిదాం మండలంలోని అన్ని రేషన్ డిపోలకు పంపిణీ చేస్తున్న బియ్యంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని డీలర్ల సంఘం జిల్లా డివిజన్ ఉపాధ్యక్షుడు కెంగువ శ్రీను, మండల అధ్యక్షుడు సుంకరి జయసింహ ఆరోపించారు. ఈ మేరకు మండలంలోని డీలర్లతో కలిసి శనివారం స్థానిక తహసీల్దార్ సులోచనారాణి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో అన్ని ప్రజాపంపిణీ రేషన్ షాపులకు పంపిణీ చేసే పేదల బియ్యంలో చీపురుపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద 50 కిలోల బస్తాకు సుమారుగా ఒకటి, రెండు కిలోల బియ్యం తరుగు రావడంతో డీలర్లు లబోదిబోమంటు న్నారని తెలిపారు. దీనిపై చీపురుపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు వెళ్లి అడిగితే.. ఎండీ ఇచ్చిన కాటాతోనే తూస్తున్నామని, ఇష్టం ఉంటే సరుకులు విడిపించవచ్చు లేకపోతే వెళ్లిపోవచ్చని గోడౌన్ ఇన్‌చార్జి సన్యాసిరావు సమాధానం ఇచ్చారని చెప్పారు. దీంతో చీపురుపల్లి ఆర్డీ వోకు, మెరకముడిదాం తహసీల్దార్‌లకు ఫిర్యాదు చేశా మన్నారు. అలాగే ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో పనిచే స్తు న్న సివిల్ సప్లయి కార్పొరేషన్ ఉద్యోగులు తూకం వేయకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని వీరు ఆరోపించారు. ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో తప్పనిసరిగా తూకం వేసిన తర్వాతే డిపోలకు బియ్యాన్ని తరలించేలా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
చర్యలు తీసుకుంటాం
చీపురుపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో రేషన్ డిపోలకు పంపిణీ చేసిన బియ్యం తరుగుదల విషయం పై తహసీల్దార్ సులోచనరాణిని వివరణ కోరగా.. సం బంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిం చేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.