లారీ ఢీకొని రెండు ఎద్దుల మృతి
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:57 PM
కాశయ్యపేట పెట్రోల్ బంకు వద్ద గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు నాటు బండ్లను లారీ ఢీకొట్టింది.
సీతానగరం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాశయ్యపేట పెట్రోల్ బంకు వద్ద గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు నాటు బండ్లను లారీ ఢీకొట్టింది. దాంతో రెండు ఎద్దు మృతిచెందాయి. ఈ ఘటనలో ముందు వెళ్తున్న నాటు బండి యజమాని తిరుపతిరావుకు చెందిన ఒక ఎద్దు, రెండో నాటు బండి యజమాని పెంట పోలినాయుడుకు చెందిన మరొక ఎద్దు ఘటన స్థలంలోనే మృతిచెందాయి. జగ్గునాయుడుపేట నుంచి ఇసుక తీసుకుని వెళ్లడా నికి సీతానగరం నుంచి నాటు బండ్లు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పార్వ తీపురం వైపు నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తిరుపతిరావుకు చిన్న గాయాలు తగలడంతో పార్వతీపురం కేంద్రాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తిరుపతి రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.రాజేష్ కేసు నమోదు చేశారు.