రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:59 PM
మండలంలోని నారసింహునిపేట సమీపంలోని మంగళవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
బొబ్బిలి రూరల్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని నారసింహునిపేట సమీపంలోని మంగళవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మక్కువ నుంచి మర్రాపు జానకిరాము అనే వ్యక్తి బైకుపై సీహెచ్ బొడ్డవలస వస్తున్నాడు. అదే సమయంలో బొబ్బిలి నుంచి మక్కువ వైపు కొల్లి పోలీసు, కొల్లి శివ బైకుపై వస్తున్నారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆటోపై బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.