రెండు ఆటోలు ఢీ
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:58 PM
మండల పరిధిలోని కొత్తపేట జంక్షన్ వద్ద శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ప్రమా దంలో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఎనిమిది మందికి గాయాలు
వీరిలో నలుగురి పరిస్థితి విషమం
రాజాం రూరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కొత్తపేట జంక్షన్ వద్ద శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ప్రమా దంలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాజాం పొలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. యండమూరి గణేష్ తెర్లాం నుంచి ఐదుగురు ప్రయాణికులతో రాజాం వైపు వస్తుండగా.. రాజాం నుంచి తెర్లాం వైపు వెళ్తున్న మరో ఆటో కొత్తపేట జంక్షన్ వద్ద ఈ ఆటో ను బలంగా ఢీకొంది. దీంతో ఆటోడ్రైవర్ గణేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయాలపాలయ్యారు. అలాగే ఢీకొన్న ఆటోలో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులకు 108 ఈఎంటీ మీసాల ఈశ్వర్రావు ప్రాథమి క చికిత్స అనంతరం వాహనంలో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన యండ్రాపు నారాయణరావు, సింగిరెడ్డి దివ్య, దువ్వి లక్ష్మణ రావు, నొషాద్‌బిగ్‌లను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. పొట్టా యశోధ రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, జామి అప్పలనాయుడు, పత్తికాన వరలక్ష్మి, గణేష్ రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం పొలీసులు కేసు నమోదు చేశారు.