Share News

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:19 AM

చోరీ కేసులో దర్యాప్తులో భాగం గా మండలంలోని రంగాపురం జంక్షన్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు నిందితులను పట్టుకున్నామని ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ తెలిపారు.

 చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

లక్కవరపుకోట, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): చోరీ కేసులో దర్యాప్తులో భాగం గా మండలంలోని రంగాపురం జంక్షన్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు నిందితులను పట్టుకున్నామని ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ తెలిపారు. సీఐ ఎల్‌.అప్పలనాయుడు ఆదేశాల మేరకు నిఘా పెట్టామని అందులో పాత, కొత్త కేసులకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామని చెప్పారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరా లిలా ఉన్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడ కొటవానిపాలెంకు చెందిన ఉపలూరి ఉదయ్‌భాస్కర్‌(బాలు), విశాఖ టౌన్‌ శాలిగ్రామపురం, కైలా సపురం కస్తూరినగర్‌-2కి చెందిన చిరత శివలను పోలీసులు అదుపులోకి తీసుకు ని, విచారణ చేపట్టారు. వారు చేసిన దొంగతనాలు అంగీకరించారు. చోరీ సొత్తు ను స్వాధీనపరిచారు. ఇందులో రెండు జతల బంగారు చెవి దుద్దులు, జత బంగారు గాజులు, బంగారు ఉంగరం, బంగారు తాడు, హారం, రెండు లక్ష్మీదేవి బంగారుకాసులు, బంగారు నల్లపూసలు, రెండు మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. వీరిపై గతంలో శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఈ దాడు ల్లో పాల్గొన్న ఎల్‌.కోట పోలీసు స్టేషన్‌ సిబ్బందిని సీఐ అభినందించారు.

Updated Date - Dec 27 , 2025 | 12:19 AM