హత్య కేసులో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:29 AM
కెరటాం గ్రామంలో ఈనెల 9న నెడుగట్టి అప్పలకృష్ణ(45) హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు.
బొండపల్లి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కెరటాం గ్రామంలో ఈనెల 9న నెడుగట్టి అప్పలకృష్ణ(45) హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. గురువారం స్థానిక పోలీసులు స్టేషన్‌లో నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పలకృష్ణ భార్య నెడుగట్టి రాజుతో అదే గ్రామానికి చెందిన వరుసకు మేనల్లుడు అయిన నారపాటి సాయితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అప్పలకృష్ణను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్టు సాయి అంగీకరించాడు. ఈ కేసులో సాయితో పాటు మృతుడి భార్య రాజును కూడా అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. సీఐ వెంట ట్రైనీ ఎస్‌ఐ సాయిరాం పడాల్ తదితరులు ఉన్నారు.