Share News

కుక్కను తప్పించబోయి..

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:09 AM

ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.

కుక్కను తప్పించబోయి..

  • అదుపు తప్పి స్కూటీ బోల్తా

  • అపస్మారక స్థితిలో భార్య

  • భర్త, ముగ్గురు పిల్లలకు గాయాలు

భోగాపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. భర్త తోపాటు ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాల య్యాయి. జాతీయ రహదారిపై సవరవల్లి సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నందిగాం గ్రామానికి చెందిన గరి విజయలక్ష్మి, సూరిపాత్రుడు అనే భార్యభర్తల కు ఆరేళ్ల లోపుగల ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. శనివారం సాయం త్రం సూరిపాత్రుడు తన స్కూటీపై వారందరినీ స్వగ్రామం నుంచి తన అత్తవా రి ఇల్లు విశాఖ జిల్లా మధురవాడకు తీసుకు వెళ్తున్నాడు. సవరవల్లి సమీపంలో కి వచ్చేసరికి రహదారికి అడ్డంగా కుక్క వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమం లో స్కూటీ బోల్తా పడింది. అందరూ రోడ్డుపై తుళ్లిపడ్డారు. విజయలక్ష్మికి తీవ్ర గాయాలు కాగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుమారుడు, ఇద్దరు కుమార్తెల కు తీవ్ర గాయాలయ్యాయి. సూరిపాత్రుడుకు కూడా గాయాలయ్యాయి. స్థాని కుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హైవే అంబులె న్స్‌ను రప్పించి క్షతగాత్రులను తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కుటుంబమంతా అక్కడ చికిత్స పొందుతోంది. దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదని సీఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపారు.

Updated Date - Oct 26 , 2025 | 12:09 AM