ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి..
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:20 AM
మండలంలోని అప్పాపురం గ్రామ సమీపం లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు.
రేగిడి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అప్పాపురం గ్రామ సమీపం లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. రేగిడి 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ మండలం మంగళాపురం గ్రామానికి చెందిన మడ పాల సాయి, సంతకవిటి మండలం మండాకురిటి గ్రామానికి చెందిన కేతుబరికి యోగేష్‌లు స్నేహితులు. వీరు ఇద్దరు రేగిడి మండలం కొమిరి వెంకటాపురం గ్రామంలో ఉన్న మరో మిత్రుడు వద్దకు బైకుపై వెళ్లే క్రమంలో.. అప్పాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి, అదుపుతప్పి జారిపడ్డారు. ఈ ఘటనలో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ నారాయణరావులు ప్రథమ చికిత్స నిర్వహించి పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది.