Funerals అంత్యక్రియలకు అవస్థలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:04 AM
Troubles for Funerals గుమ్మలక్ష్మీపురానికిసుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యవలస గిరిజన ప్రజలు అంత్యక్రియలకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరు చనిపోయినా కిలోమీటరు దూరంలో ఉన్న వాగు దాటి శ్మశానానికి వెళ్లాల్సి వస్తోంది.
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురానికిసుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యవలస గిరిజన ప్రజలు అంత్యక్రియలకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరు చనిపోయినా కిలోమీటరు దూరంలో ఉన్న వాగు దాటి శ్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా వర్షాకాలంలో మాత్రం వాగులో నడుం లోతు నీటిని దాటాల్సిన దుస్థితి. ఈ గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళ (48) అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతవాసులు మృతదేహాన్ని మోసుకుంటూ.. వాగును దాటి శ్మశానానికి చేరుకున్నారు. ప్రస్తుతం వాగులో నీరు ఎక్కువగా ఉండగా.. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, గ్రామానికి వాగుకు మధ్యలో శ్మశానానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని గిరిజనులు కోరుతున్నారు.