Share News

Trouble in Secretariat ANMs సచివాలయ ఏఎన్‌ఎంల్లో గుబులు

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:43 PM

Trouble in Secretariat ANMs గంట్యాడ మండల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీల్లో (ఏఎన్‌ఎం) కొందరికి ఈనెల 7న రిలీవ్‌ చేశారు. వేపాడ మండలం పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ (ఎఎన్‌ఎం)లకు ఈనెల 9న రిలీవ్‌ చేశారు. ముందుగా రిలీవ్‌ అయిన వారంతా మరుసటి రోజు కొత్తస్థానాల్లో చేరేందుకు అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ఒకట్రెండు రోజులు ముందు వెనుక తేడా ఉంటోంది. అయితే వెనుక చేరే ఏఎన్‌ఎంలు గుబులు చెందుతున్నారు. ఈసారి బదిలీలు, పదోన్నతులకు డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారేమోనని అనుమానిస్తున్నారు.

Trouble in Secretariat ANMs సచివాలయ ఏఎన్‌ఎంల్లో గుబులు

సచివాలయ ఏఎన్‌ఎంల్లో గుబులు

ఒక్కో మండలంలో ఒక్కో విధంగా విధులకు రిలీవ్‌

జాయినింగ్‌ ఆర్డర్‌లు ఆలస్యంగా తీసుకున్న వారిలో భయం

ఈసారి బదిలీలు, పదోన్నతుల్లో అన్యాయం చేస్తారేమోనని టెన్షన్‌

శృంగవరపుకోట, జూలై 12(ఆంధ్రజ్యోతి):

- గంట్యాడ మండల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీల్లో (ఏఎన్‌ఎం) కొందరికి ఈనెల 7న రిలీవ్‌ చేశారు. వేపాడ మండలం పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ (ఎఎన్‌ఎం)లకు ఈనెల 9న రిలీవ్‌ చేశారు. ముందుగా రిలీవ్‌ అయిన వారంతా మరుసటి రోజు కొత్తస్థానాల్లో చేరేందుకు అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ఒకట్రెండు రోజులు ముందు వెనుక తేడా ఉంటోంది. అయితే వెనుక చేరే ఏఎన్‌ఎంలు గుబులు చెందుతున్నారు. ఈసారి బదిలీలు, పదోన్నతులకు డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారేమోనని అనుమానిస్తున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు జూన్‌ 30న గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ (గ్రేడ్‌-3 ఏఎన్‌ఎం)లకు బదిలీలు చేపట్టారు. ఈ బదిలీల్లో డేట్‌ ఆప్‌ అపాయింట్‌మెంటుకు ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో విధుల్లో ముందు చేరిన వారంతా ఈ బదిలీల్లో స్థానాలు కోరుకొనేందుకు ముందు అవకాశం వచ్చింది దీంతో వీరు ఆశించిన స్థానాలను పొందగలిగారు. మిగిలిన వారంతా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కోరుకోవాల్సి వచ్చింది. తిరిగి మూడేళ్లకో, ఐదేళ్లకో జరిగే బదిలీల్లోను ఇదే పద్ధతిని అనుసరిస్తే ఇప్పుడు వెనక చేరిన వారికి మళ్లీ ఆన్యాయం జరుగుతుందేమోనని సందేహ పడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో పాటు మండల ప్రజా పరిషత్‌ అధికారులు బదిలీపై వెళ్లిన వారిని రిలీవ్‌ చేశారు. అలాగే బదిలీపై వచ్చిన వారికి మండల ప్రజాపరిషత్‌ అధికారులు జాయినింగ్‌ ఆర్డర్‌లు ఇస్తున్నారు. రిలీవ్‌ తేదీకి ఒక రోజు వెనుక తేదీని జాయినింగ్‌కు ఇస్తున్నారు. ఉదాహరణకు 7న రిలీవ్‌ అయిన వారికి 8న జాయినింగ్‌, 9న రిలీవ్‌ అయిన వారికి 10న జాయినింగ్‌ ఆర్డర్‌లు ఇస్తున్నారు. ఇలా ఒకట్రెండు రోజలు వెనకా ముందు జాయినింగ్‌లు జరుగుతుండడంతో వెనక జాయినింగ్‌ రిపోర్టు తీసుకున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈసారి బదిలీలు, పదోన్నతుల్లో అన్యాయం చేస్తారేమోనని టెన్షన్‌ పడుతున్నారు.

- గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు గ్రేడ్‌-2 ఏఎన్‌ఎంలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ముందు ఇందుకు సంబంధించిన తుది జాబితాను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పిస్తారని ఏఎన్‌ఎంలు అశిస్తున్నారు. డేట్‌ ఆప్‌ అపాయింట్‌మెంటును ప్రామాణికంగా తీసుకొని బదిలీలు జరగడంతో పదోన్నతులకు ఇదే విధానం అనుసరిస్తారేమోనన్న భయం వీరిని వెంటాడుతోంది.

----------

Updated Date - Jul 12 , 2025 | 11:43 PM