Share News

గిరిజనులకు సాగు పట్టాలివ్వాలి

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:18 AM

కాకర్లవలసగిరిజనులు సాగుచేస్తున్న భూ ములకు సాగు పట్టాలివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్‌ చేశారు.

గిరిజనులకు సాగు పట్టాలివ్వాలి
గిరిజనులతో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ:

రామభద్రపురం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కాకర్లవలసగిరిజనులు సాగుచేస్తున్న భూ ములకు సాగు పట్టాలివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్‌ చేశారు. గురువారం కారేడువలసలో భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఏళ్లుగా గిరిజనులు సాగుచేస్తున్న భూములను ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటా యించడం దుర్మార్గమన్నారు.జిల్లాఅధికారులు గిరిజనులకు న్యాయంచేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె.భీముడు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.అప్పారావు, కార్యవర్గ సభ్యురాలు రవణమ్మ పాల్గొన్నారు.

గిరిజనులకు కొత్త పథకాలు ప్రకటించాలి

ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధి,సంక్షేమంకోసం ఆదివాసీదినోత్సవంలో కొత్త పథకా లు ప్రకటించాలని ఏపీ గిరిజన సంఘం నాయకులు పి.శ్రీను కోరారు. గురువారం రామభద్రపురంలో ప్రపంచ ఆదివాసీదినోత్సవం పురష్కరించుకొని కరపత్రాలను విడు దల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు.గిరిజనప్రాంతాల్లో శతశాతం ఉద్యోగ, ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కారేడువలస, కాకర్లవల సల్లో గిరిజనులు సాగుచేసిన భూములను అభివృద్ధి పేరుతో స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు.ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు గిరిజన సంఘ నాయకులు వారికి మద్దతుగా ఉంటారన్నారు.కార్యక్రమంలో సీఐటీయూ నాయ కులు బలసా శ్రీనివాసరావు, గిరిజన సంఘ నాయకులు రాంబాబు, తౌడమ్మ, జాంబ్రి, లక్ష్మి, లక్షణరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:18 AM