Share News

Tribal Youth గిరిజన యువత ఆర్థికంగా స్థిరపడాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:35 AM

Tribal Youth Must Achieve Economic Stability గిరిజన యువత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం ‘ప్రభుత్వ పథకాలు, జీవనోపాధులు’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు.

Tribal Youth  గిరిజన యువత ఆర్థికంగా స్థిరపడాలి
మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌

సీతంపేట రూరల్‌, నవంబరు19(ఆంధ్రజ్యోతి): గిరిజన యువత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం ‘ప్రభుత్వ పథకాలు, జీవనోపాధులు’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఐటీడీఏ ద్వారా అందిస్తున్న జీవనోపాధి, స్వయం ఉపాధి పథకాలను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలి. తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించాలి. ఐటీడీఏ సహకారంతో గిరిజన యువత ఏర్పాటు చేసుకునే ప్రతి యూనిట్‌ పరిశీలన కోసం లబ్ధిదారుల ఇంటికి వెళ్తా. సరైన ప్రణాళికతో ముందకు సాగితే ఆర్థిక అభివృద్థి సాధించొచ్చు. రుణాల మంజూరుపై సంబంధిత బ్యాంక్‌లతో మాట్లాడి పూర్తి సహకారం అందిస్తాం. ’ అని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల డీఆర్‌డీఏ పీడీలు కిరణ్‌, సుధారాణి , ఉమ్మడి జిల్లాల ఎల్‌డీఎంలు విజయ్‌స్వరూప్‌, శ్రీనివాసరావు, ఐటీడీఏ ఏపీవో గణేష్‌, ఇండస్ర్టీయల్‌ అధికారులు, 20సబ్‌ప్లాన్‌ మండలాలకు చెందిన గిరిజన యువతీ, యువకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:35 AM