వైసీపీ నాయకులపై రాజద్రోహం కేసులు పెట్టాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:20 AM
రాష్ట్రంలో నే ఉంటూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలి గేలా మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణపైన రాజద్రోహం కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.
చీపురుపల్లి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నే ఉంటూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలి గేలా మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణపైన రాజద్రోహం కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. చీపురుపల్లిలోని టీడీపీ కార్యాల యంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు ఇప్పుడు పీపీపీ విధానం ద్వారా జరగుతున్న ఒప్పందాలు తమ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని భయపెడుతున్నారని, ఇటువంటి ప్రవర్తన తప్పకుండా రాజద్రోహం కిందకి వస్తుందని కళా అన్నారు. ఆ పార్టీకి ఓటేయనంత మాత్రాన రాష్ట్ర ప్రజలు నష్టపోవాలా అని కళా ప్రశ్నించారు. సమావే శంలో ఏఎంసీ చైర్మన్ రేగాన రామారావు, పార్టీ నాయ కులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, వి.సన్యాసినాయుడు, సారేపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.