పారదర్శకంగా ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:28 PM
ధాన్యంకొనుగోలులో ప్రభుత్వం పార దర్శకంగా వ్యవహరిస్తోందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
ఎస్.కోటరూరల్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ధాన్యంకొనుగోలులో ప్రభుత్వం పార దర్శకంగా వ్యవహరిస్తోందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. బుధవారం మండలంలోని తిమిడి, వసి గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేం ద్రాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు.రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం కొనుగోలు లో ఎటువంటి ఇబ్బందిలేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులు ధాన్యం అందించిన ఒక్కరోజులోనే ఖాతాలకు ప్రభుత్వం నగదు జమచేస్తుందని తెలి పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాయవరపు రవి, ఏవో రవీంద్ర పాల్గొన్నారు.