Share News

Grain Procurement పారదర్శకంగా ధాన్యం సేకరణ

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:36 PM

Transparent Grain Procurement జిల్లాలో పారదర్శకంగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం మండలం వెంకంపేటలో ఉన్న రైస్‌మిల్లును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్లు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో మాట్లాడారు.

  Grain Procurement పారదర్శకంగా ధాన్యం సేకరణ
గోనె సంచులు పరిశీలిస్తున్న జేసీ

పార్వతీపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారదర్శకంగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం మండలం వెంకంపేటలో ఉన్న రైస్‌మిల్లును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్లు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో మాట్లాడారు. రైతులకు మంచి గోనె సంచులు ఇవ్వాలన్నారు. ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సాయంత్రం ఐదు గంటల వరకు ట్రక్‌ షీట్లు జనరేట్‌ అవుతాయని, అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీపీసీ వద్ద అందుబాటులో ఉన్న అన్ని రికార్డులు, పరికరాలను పరిశీలించారు. టార్పాలిన్లు, సిబ్బంది వివరాలను జేసీ అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లను సమన్వయం చేసు కుంటూ కస్టోడియన్‌ అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు.

Updated Date - Oct 21 , 2025 | 11:36 PM