Share News

పారదర్శకంగా కూటమి పాలన

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:38 AM

కూటమి ప్రభుత్వ హయాంలో పారదర్శకమైన పరిపాలన సాగుతోందని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. సోమవారం స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియలో నియో జకవర్గ పరిఽధిలోని నాలుగు మండలాల లబ్ధిదారులకు 82,958 క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత కొత్త స్మార్ట్‌ రేషన్‌కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తహశీల్దారు మలపురెడ్డి శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,600 కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేశారన్నారు.

పారదర్శకంగా కూటమి పాలన
బొబ్బిలికోటలో టీడీపీలో చేరిన ఆనవరం గ్రామస్థులతో బేబీనాయన:

బొబ్బిలి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):కూటమి ప్రభుత్వ హయాంలో పారదర్శకమైన పరిపాలన సాగుతోందని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. సోమవారం స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియలో నియో జకవర్గ పరిఽధిలోని నాలుగు మండలాల లబ్ధిదారులకు 82,958 క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత కొత్త స్మార్ట్‌ రేషన్‌కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తహశీల్దారు మలపురెడ్డి శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,600 కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేశారన్నారు. సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ మాట్లాడుతూ బొబ్బిలి పట్టణ, మండలానికి కలిపి 67 రేషన్‌ షాపుల పరిధిలో 35,258 కార్డులు, రామభద్రపురం మండలంలో 33 షాపుల పరిధిలో 15,020 కార్డులు, బాడంగి మండలంలో 37 షాపుల పరిధిలో 14,420 , తెర్లాం మండలంలో 58 షాపుల పరిధిలో 18,233 స్మార్ట్‌రేషన్‌ కార్డులు ఇస్తు న్నట్లు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాం బార్కి శరత్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ నర్సుపల్లి వెంకట నాయుడు, రౌతు రామ్మూర్తి, అల్లాడ భాస్కరరావు, బొంతు త్రినాథ, వెలగాడ హైమావతి, కళ్యంపూడి సత్యనారాయణ, బీసపు పార్వతి, నాలుగు మండలాల తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు, డీలర్లు పాల్గొన్నారు.

ఫబాడంగి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): బాడంగిలో స్మార్ట్‌ రేషన్‌కార్డులను సర్పంచ్‌ కండి రమేష్‌, ఎంపీ టీసీ దేవరాపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. డీలరు, సచివాలయసిబ్బంది ఇంటింటికి వెళ్లి అందజేశారు.

టీడీపీలో ఆనవరం గ్రామస్థుల చేరిక

బొబ్బిలి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): బాడంగి మండలంలోని ఆనవరం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. బొబ్బిలి కోటలోని ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో చేరారు. ఈమేరకు టీడీపీ కండువాలు వేసి వారికి వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకలు సిరికి సింహాచలం, బలిజిరెడ్డి రాంబాబు, వాకాడ ఎర్రంనాయుడు, పతివాడ రామకృష్ణ, రాపాక రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:38 AM