Share News

పట్టుబడిన ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:27 AM

మండలంలో వరుసగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు కొంతకాలంగా జరుగుతున్నాయి.

పట్టుబడిన ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు

పూసపాటిరేగ, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): మండలంలో వరుసగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. వాటిని చోరీకి పాల్పడిన వారిని గురువారం కందివలసగెడ్డ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజుల కిందట మండలంలో ఎస్‌ఎంఎస్‌ పరిశ్రమలో సుమారుగా రూ.లక్ష విలువచేసే కేబుల్‌ వైర్‌ దొంగతనం జరిగినట్టు పరిశ్రమదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం ఓ వాహనంలో కేబుల్‌ వైర్‌ తరలిస్తుండటాన్ని గుర్తించారు. ఏడుగురు వ్యక్తులను ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మండలంలో వరుస చోరీకి గురైన 20 ట్రాన్స్‌ఫార్మర్లను వీరే చోరీ చేసినట్టుట బయటపడింది. అదుపులోకి తీసుకొన్న వారిలో ఇద్దరు మహిళలు ఉండటం విశేషం.

Updated Date - Nov 14 , 2025 | 12:27 AM