Share News

మార్గదర్శకాలిచ్చిన తర్వాతే బదిలీలు చేయాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:52 PM

మార్గదర్శకాలు ఇచ్చిన తరువాతే బదిలీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇం జనీరింగ్‌ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవా రం జియ్యమ్మవలస ఎంపీడీవో కె.ధర్మారావుకు రేషనలైజేషన్‌తో తమ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు వినతిపత్రం అందజేశారు.

మార్గదర్శకాలిచ్చిన తర్వాతే బదిలీలు చేయాలి
ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఈఏలు:

జియ్యమ్మవలస, జూన్‌25 (ఆంధ్రజ్యోతి):మార్గదర్శకాలు ఇచ్చిన తరువాతే బదిలీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇం జనీరింగ్‌ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవా రం జియ్యమ్మవలస ఎంపీడీవో కె.ధర్మారావుకు రేషనలైజేషన్‌తో తమ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ 2019 నుంచి గ్రామస్థాయిలో పలు శాఖల ఇంజనీరింగ్‌ పనులు, పలు సర్వేలు, బీఎల్‌వో విధులు కూడా చేశామన్నారు. కానీ నేటికీ ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన రేషనలైజేషన్‌లో మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే మిగులుగా గుర్తించిన ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు పోస్టింగ్‌ ఎక్కడ ఇవ్వనున్నారో స్పష్టతలేదన్నారు కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీడీవో కె.ధర్మారావు తెలిపారు.

Updated Date - Jun 25 , 2025 | 11:52 PM