Share News

Transfer of SIs ఎస్‌ఐల బదిలీ

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:08 AM

Transfer of SIs జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Transfer of SIs   ఎస్‌ఐల బదిలీ

బెలగాం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శిక్షణ ఎస్‌ఐలుగా ఉన్న ఎం.హేమ లతను సీతానగరానికి, అర్జున్‌ను పాచిపెంటకు బదిలీ చేశారు. ఎం.రాజేష్‌ను సీతానగరం నుంచి పార్వతీపురం రూరల్‌ స్టేషన్‌కు, పి.దినకర్‌ను పార్వతీపురం రూరల్‌ నుంచి డీఎస్‌బీకి, ఎం.జగదీష్‌ నాయుడు వీఆర్‌ నుంచి కొమరాడ పీఎస్‌కు, కె.నీలకంఠంను కొమరాడ నుంచి వీఆర్‌కు స్థానచలనం కల్పించారు. కె.ప్రయోగమూర్తిని పాలకొండ నుంచి పార్వతీపురం టౌన్‌ పీఎస్‌కు, వెంకన్నను వీఆర్‌ నుంచి పాలకొండ పీఎస్‌కు, ఎస్‌.షణ్ముఖరావును వీఆర్‌ నుంచి వీరఘట్టం పీఎస్‌కు, జి.కళాధర్‌ను వీరఘట్టం నుంచి వీర్‌కు బదిలీ చేశారు.

Updated Date - Dec 30 , 2025 | 12:08 AM