Training for New Teachers రేపటి నుంచి కొత్త గురువులకు శిక్షణ
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:57 PM
Training for New Teachers Begins Tomorrow మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త గురువులకు ఈ నెల 3 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా డెంకాడ మండలం, మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు.
సాలూరు రూరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త గురువులకు ఈ నెల 3 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా డెంకాడ మండలం, మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 583 పోస్టులకు గాను 578 మందిని ఎంపిక చేశారు. మరో ఐదు పోస్టులకు అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఖాళీగా మిగిలిపోయాయి. ఎంపికైన కొత్త గురువులకు గత నెల 25న అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. కాగా 578 మంది పోస్టులకు ఎంపికైన 321 మంది పురుషులు, 257 మంది మహిళలకు మోదవలసలో రెండు వేదికల్లో శిక్షణనివ్వనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జోన్ పోస్టులకు ఎంపికైన 390 మందికి కూడా రెండు వేదికల్లో శిక్షణనివ్వనున్నారు. అల్లూరి సీతారామరాజుజిల్లా అరకులో గుడ్‌మార్నింగ్ రిసార్ట్‌లో 198 మందికి, మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 192 మందికి శిక్షణ ఇస్తారు. ఈ మేరకు రిసోర్స్‌పర్సన్‌ను అలాట్ చేశారు. ఇక రాష్ట్రస్థాయి పోస్టులకు ఎంపికైన 243 మందికి ఏలూరులో శిక్షణనివ్వనున్నారు.