New Teachers కొత్త గురువులకు శిక్షణ
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:06 AM
Training for New Teachers మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు శిక్షణ ప్రారంభమైంది. శుక్రవారం డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వారంతా హాజరయ్యారు. రెసిడెన్షియల్ తరహాలో ఈ నెల 10 వరకు శిక్షణ కొనసాగుతుంది.
సాలూరు రూరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి ): మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు శిక్షణ ప్రారంభమైంది. శుక్రవారం డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వారంతా హాజరయ్యారు. రెసిడెన్షియల్ తరహాలో ఈ నెల 10 వరకు శిక్షణ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో 266 ఎస్జీటీలు, పాఠశాల సహాయకుల విభాగంలో సోషల్ స్టడీస్ 67, ఫిజిక్స్ 56, బయాలజీ 36, గణితం 33, తెలుగు 14, హిందీ 14, ఆంగ్లం 30, ఫిజికల్ డైరెక్టర్ 62 పోస్టులకు 578 మందిని మెగా డీఎస్సీలో ఎంపిక చేసిన విషయం విదితమే. సబ్జెక్ట్‌ల వారీగా ఓయోస్టార్ స్కూల్‌లో వారికి గదులు కేటాయించి శిక్షణ కార్యక్రమాన్ని ఆరంభించారు. కాగా కొత్త గురువులు సమయానికి అర గంట ముందే శిక్షణ వేదికకు చేరుకున్నారు. వారికి కేటాయించిన గదుల్లో బోధన తదితర విషయాలపై రిసోర్స్‌పర్సన్లు పలు విషయాలు వివరించారు. శిక్షణ అనంతరం కొత్త టీచర్లకు ఉమ్మడి జిల్లాలో పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కేటాయించనున్నారు.