Share News

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:30 AM

మండల పరిధిలోని గొల్లలపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్‌ఐ వెలమల ప్రసాద రావు తెలిపారు.

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌

-నలుగురికి తీవ్ర గాయాలు

రామభద్రపురం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గొల్లలపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్‌ఐ వెలమల ప్రసాద రావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లలపేట నుంచి కొట్టక్కి వెళ్తున్న ఆటోను ఇసుక కోసం గొల్లలపేట వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో గొల్లలపేట గ్రామానికి చెందిన బాలి ఆదిలక్ష్మి(37) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలోని బాలి పద్మావతి, బాలి రవణమ్మ, లెంక సత్యవతి, బాలి వాసవిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బొబ్బిలి ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు లలిత, హేమ ఉన్నారు. భర్త రామకృష్ణ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 10 , 2025 | 12:30 AM