Share News

గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు

ABN , Publish Date - May 22 , 2025 | 12:18 AM

విష జ్వరాలతో గిరిజన గ్రామాలు వణుకుతు న్నాయి. పదుల సంఖ్యలో జ్వర పీడితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు
చినమేరంగి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు

- ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న అడవిబిడ్డలు

జియ్యమ్మవలస, మే 21 (ఆంధ్రజ్యోతి): విష జ్వరాలతో గిరిజన గ్రామాలు వణుకుతు న్నాయి. పదుల సంఖ్యలో జ్వర పీడితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇందులో ఎక్కువమంది చిన్న పిల్లలే ఉన్నారు. జియ్యమ్మవలస, ఆర్‌ఆర్‌బీపురం పీహెచ్‌సీ లతో పాటు చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జ్వరపీడితులు చికిత్స పొందుతు న్నారు. అర్నాడ ఏజెన్సీ పంచాయతీ వనజకు చెందిన ఊయక తాతబాబు, ఊలక నవీన్‌, కొత్తవలసకు చెందిన ఊలక గౌతమి, ఊలక మీనాక్షి, మండంగి వరలక్ష్మి, అర్నాడ గ్రామా నికి చెందిన తాడంగి దిలీప్‌కుమార్‌, లక్ష్మీపే టకు చెందిన కొండగొర్రి రుషి, కొండసిరిపికి చెందిన మండంగి సింధు, కిడిగేసుకు చెందిన 14 నెలల బాలుడు ఆరిక రుషి, జమ్మువలసకు చెందిన తోయక సహస్ర, నందివానివలసకు చెందిన బూర్జ శైలజ, బూర్జ నందు, పిప్పలభద్రకు చెందిన కొప్పర తిరుపతిరావు చికిత్స పొందుతున్నారు. వీరిలో అత్యధికులు గిరిజనులే. అందులో 18 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా వైద్య విధాన పరిషత్‌ ముందస్తు చర్యలు తీసుకోకుంటే తీవ్ర ముప్పు తప్పదని గిరిజన సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

Updated Date - May 22 , 2025 | 12:18 AM