అభివృద్ధిలో టౌన్‌ప్లానింగ్ కీలకం
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:08 AM
అభివృద్ధిలో టౌన్‌ప్లానింగ్ విభాగం కీలకమైందని, క్షేత్రస్థాయి విధి నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని ఏపీ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు
విజయనగరం టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):అభివృద్ధిలో టౌన్‌ప్లానింగ్ విభాగం కీలకమైందని, క్షేత్రస్థాయి విధి నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని ఏపీ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం విజయనగరంలో అసోసియేషన్ ఎగ్జి క్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లా డుతూ టౌన్‌ప్లానింగ్‌కు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉందని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌నుంచి బిల్డింగ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకావడం లేదని తెలిపారు. వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి అధికారాలు కల్పించారని, వారికి పూర్తిస్థాయిలో పదోన్నతులు కల్పిస్తే క్షేత్రస్థాయి సమస్యలు చాలావరకూ పరి ష్కారం అవుతాయని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మోహన్ బాబు, వసీంబేగ్, అబ్దుల్ సత్తార్, నాయుడు, రమణమూర్తి, వెంకటేశ్వరావు, కృష్ణ, రతన్‌రాజు, సునీత,మతీన్ పాల్గొన్నారు.