Tottapalli Water ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి తోటపల్లి నీరు
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:00 AM
Tottapalli Water Enters RTC Complex పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేటులోకి ఆదివారం తోటపల్లి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అవసరం లేదు. అయినప్పటికీ సంబంధిత శాఖాధికారులు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.
పాలకొండ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేటులోకి ఆదివారం తోటపల్లి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అవసరం లేదు. అయినప్పటికీ సంబంధిత శాఖాధికారులు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఇది వడమ నుంచి పలు కాలనీల మీదుగా రహదారులు పక్కనే ఉన్న మురుగుకాలువల్లోకి చేరుతుంది. అయితే మురుగుకాలువలు చెత్తాచెదారాలు నిండిపోవడంతో ఆ నీరు ప్రదాన రహదారులపైకి వచ్చి చేరుతుంది. గత కొన్ని రోజులుగా పట్టణంలోకి పలు కాలనీ వాసులు ఇబ్బందులు పడతుండగా.. తాజాగా తోటపల్లి సాగునీరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి చేరింది. మొత్తంగా సాగునీరు వృథా అవుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.