Share News

Totapalli Water నగర పంచాయతీ వీధుల్లోకి తోటపల్లి నీరు

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:21 AM

Totapalli Water Flows Into Town Panchayat Streets తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ నీరు బుధవారం నగర పంచాయతీ పరిధిలోని పలు వీధుల్లోకి చేరింది. దీంతో నీలమ్మకాలనీ, టీచర్స్‌ కాలనీ, సీఎల్‌నాయుడు నగర్‌, ఆదిత్యనగర్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Totapalli Water  నగర పంచాయతీ వీధుల్లోకి  తోటపల్లి నీరు
కాలనీ రోడ్లుపై నీరు చేరిన దృశ్యం

పాలకొండ, నవంబరు, 26(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ నీరు బుధవారం నగర పంచాయతీ పరిధిలోని పలు వీధుల్లోకి చేరింది. దీంతో నీలమ్మకాలనీ, టీచర్స్‌ కాలనీ, సీఎల్‌నాయుడు నగర్‌, ఆదిత్యనగర్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాస్తవంగా తోటపల్లి ఎడమ కాలువ ద్వారా వడమ పంట పొలాలకు నీరు అందాల్సి ఉంది. అయితే కాలువలు ఆక్రమణలకు గురవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పట్టణంలోని వీధులు, రహదారులపై ఆ నీరు చేరుతుండడంతో ఆయా కాలనీవాసులు, పాదచారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అన్నదాతలు ఖరీఫ్‌ వరి కోత పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొంతమంది మినుము, పెసర సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తోటపల్లి ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:21 AM