Share News

‘Mukkoti Ekadashi’ ముక్కోటి ఏకాదశికి ‘తోటపల్లి’ సిద్ధం

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:07 AM

Totapalli Gets Ready for ‘Mukkoti Ekadashi’ ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు ముక్కోటి ఏకాదశికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆలయాలను ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు.

  ‘Mukkoti Ekadashi’ ముక్కోటి ఏకాదశికి ‘తోటపల్లి’ సిద్ధం
ఉత్తర ద్వారానికి అలంకరణ చేసిన దృశ్యం

గరుగుబిల్లి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు ముక్కోటి ఏకాదశికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆలయాలను ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కాగా ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్‌, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల మధ్య తోపులాట జరగకుండా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పోలీస్‌ సిబ్బంది కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. కాగా ఉదయం 8 గంటలకు స్వామివారిని హనుమత్‌ వాహనంపై తిరువీధి మహోత్సవం నిర్వహించనున్నారు. ఆతర్వాత భక్తులకు ఉత్తర ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తారు.

Updated Date - Dec 30 , 2025 | 12:07 AM