Totapalli తోటపల్లి గేట్లు మూసివేత
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:43 PM
Totapalli Gates Closed మొంథా తుఫాన్ ప్రభావంతో భారీగా చేరిన వరద కారణంగా తోటపల్లి స్పిల్‌వేకు ఆనుకుని ఉన్న మట్టికట్టలు, ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడ ప్రాంతాలు కోతకు గురయ్యాయి.
ప్రాజెక్టు వైపు ఎవరూ రాకుండా చర్యలు
గరుగుబిల్లి, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో భారీగా చేరిన వరద కారణంగా తోటపల్లి స్పిల్‌వేకు ఆనుకుని ఉన్న మట్టికట్టలు, ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడ ప్రాంతాలు కోతకు గురయ్యాయి. గతంలో కొంతమేర రివిట్‌మెంట్ పనులు నిర్వహించారు. అయితే నిధుల సమస్య కారణంగా పనులు అర్ధాంతరంగా నిలిచాయి. ప్రస్తుతం కోతకు గురికావడంతో ప్రాజెక్టు ప్రాంతం గతంలో మాదిరిగానే దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు ఎవరూ రాకుండా అధికారులు ప్రధాన గేటుకు తాళం వేశారు. ‘వరదల కారణంగా ప్రాజెక్టులో పలు ప్రాంతాలు కోతలకు గురయ్యాయి.. వాహనదారులు, పర్యాటకులు ప్రమాదాలకు గురవకుండా ఉండాలనే ఈ చర్యలు తీసుకున్నాం. అసంపూర్తిగా ఉన్న పనులు నిర్వహణకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభమవుతాయి. ’ అని ప్రాజెక్టు జేఈ బి.కిషోర్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి 5,300 క్యూసెక్కులు చేరగా, స్పిల్‌వే గేట్లు నుంచి 3,900 క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 103.73 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా