Totapalli’ ‘తోటపల్లి’కి జలకళ
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:34 PM
Totapalli’ Comes Alive with Water తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళను సంతరించు కుంది. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతం ఒడిశాలో కూడా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు ఒక్కసారిగా పెరిగాయి.
గరుగుబిల్లి, జూలై5(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళను సంతరించు కుంది. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతం ఒడిశాలో కూడా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.35 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. శనివారం సుమారు 4500 క్యూసెక్కులను స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు విడిచిపెట్టారు. ప్రాజెక్టులో 2.534 టీఎంసీలకు గాను ప్రస్తుతం 2.122 టీఎంసీల నీరు ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు ఢోకా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి ఆదివారం సాగునీరు విడుదల చేయనున్నారు. ఉల్లిభద్ర పరిధిలోని జీవో కిలో మీటరు నుంచి 117.89 కిలో మీటరు వరకు నీరు సరఫరా కానుంది. తోటపల్లి నుంచి పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో 333 గ్రామాల పరిధిలోని 1,31,221 ఎకరాలకు సాగునీరు అందనుంది. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో పాటు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, మూడు జిల్లాల శాసనసభ్యులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాజెక్టు ఈఈ హెచ్.మన్మఽథరావు తెలిపారు.