Share News

Toll-Free Number తాగునీటి సమస్య పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నెంబర్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:35 PM

Toll-Free Number for Drinking Water Issue Resolution ఐటీడీఏ పరిధిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తితే ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 94902 01062కు సమాచారం అందించాలని ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Toll-Free Number   తాగునీటి సమస్య పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నెంబర్‌

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తితే ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 94902 01062కు సమాచారం అందించాలని ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి దృష్ట్యా ఏజెన్సీలో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాగునీటి ఇబ్బందులపై సమాచారం ఇచ్చిన వెంటనే సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కాగా గిరిజనుల నుంచి జీసీసీ సేకరించిన కొండచీపుర్లుకు ఐటీడీఏ కార్యాలయంలో అడ్వాన్స్‌ టెండర్లు నిర్వహించారు. 10మంది టెండర్‌దారులు పాల్గొనగా, 63టన్నుల లూజు చీపుర్లు, 25 వేల చీపురు కట్టలకు టెండర్‌లు ఖరారు చేసినట్లు ఇన్‌చార్జి పీవో తెలిపారు. ఈ ప్రక్రియలో జీసీసీ డీఎం సంధ్యారాణి, బీఎంలు నర్సింహులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:35 PM